అఫ్గాన్ స్టార్ ప్లేయర్ రహ్మత్ షా చనిపోయాడా? సోషల్ మీడియాలో వార్త వైరల్
- రహ్మత్ తల్లి మరణంతో ఇంట్లో విషాదం
- కరీమ్ జనత్ పెట్టిన పోస్ట్ వైరల్
- ఇన్‌స్టా తప్పు అనువాదం వల్ల గందరగోళం
- సురక్షితంగా ఉన్న రహ్మత్
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రహ్మత్ షా చనిపోయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 32 ఏళ్ల రహ్మత్ షా మరణించాడంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు తేలింది.
అఫ్గాన్ ఆల్‌రౌండర్ కరీమ్ జనత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ వల్ల ఈ గందరగోళం మొదలైంది. రహ్మత్ షా తల్లి మరణించడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కరీమ్ జనత్ పష్తో భాషలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు రహ్మత్ షా ఫొటోను జత చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఆ పష్తో సందేశాన్ని ఇంగ్లీషులోకి తప్పుగా అనువదించింది. రహ్మత్ షా తల్లి చనిపోయారనే విషయాన్ని మార్చేసి, రహ్మత్ షానే చనిపోయాడంటూ తప్పుడు అర్థం వచ్చేలా చూపించింది. దీంతో అభిమానులు కంగారుపడి ఆ వార్తను వైరల్ చేశారు.
రహ్మత్ షా గత ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అఫ్గానిస్థాన్ తరఫున చివరిసారిగా ఆడాడు. ఆ సిరీస్‌లో గాయం కారణంగా అతడు చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాడు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ యాప్ చేసిన తప్పు అనువాదం వల్లే ఈ ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.